: సీటు మార్చినందుకు నష్ట పరిహారం రూ.20 లక్షలు!


సీటు మార్చిన ఫలితంగా, ఓ ప్రయాణికుడికి లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సంస్థ 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు రాష్ట్ర కన్స్యూమర్ రిడ్రసల్ కమిషన్ ఆదేశించింది. నాలుగేళ్ల క్రితం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మాడ్రిడ్ కు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో శివప్రకాశ్ గోయెంకా (70) అనే ప్రయాణికుడు అనారోగ్య కారణంతో బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఎయిర్ లైన్స్ సంస్థ అతని అనుమతి తీసుకోకుండా సీటును ఎకానమీ క్లాస్ కు మార్చింది. దీంతో గోయెంకా కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో, లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సంస్థ పరిహారంగా 1500 యూరోల వోచర్ ఇచ్చింది. అయితే, తనకు కలిగిన అసౌకర్యానికి తన టికెట్ ధర 2.5 లక్షల రూపాయలతో పాటు పరిహారంగా 65 లక్షల రూపాయలు చెల్లించాలని ఆయన ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఆయన అసౌకర్యానికి గురికాకుండా బిజినెస్ క్లాస్ టికెట్ కు బదులు రెండు ఎకానమీ క్లాస్ టికెట్లను ఇచ్చామని, ఫిర్యాదు అనంతరం తామిచ్చిన వోచర్ ను కూడా స్వీకరించారని లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ తన వాదనను వినిపించింది. తాను అధికారులతో గొడవకు దిగితే ఫ్లైట్ మిస్ అవుతుందనే కారణంతో అప్పటికి వెళ్లిపోయానని బాధితుడు కన్స్యూమర్ ఫోరంకు తెలిపారు. దీంతో గోయెంకాకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను ఫోరం ఆదేశించింది.

  • Loading...

More Telugu News