: అజం ఖాన్ ఓ కాకి... ఏ చెట్టుపై వాలితే ఆ చెట్టుకు రోగం వస్తుంది: యోగి ఆదిత్యనాథ్
ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాదీ నేత అజం ఖాన్ పై బీజేపీ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. పంది కూడా పిల్లలు కంటుందని, అదేమీ పెద్ద విషయం కాదని అన్నారు. అజం ఖాన్ ఓ కాకి అని, ఏ చెట్టు కొమ్మపై వాలితే ఆ కొమ్మకు రోగం వస్తుందని ఎద్దేవా చేశారు. అజం ఖాన్ వంటి వ్యక్తులను పాకిస్థాన్ పంపించేయాలి అని వ్యాఖ్యానించారు. తనకు కుటుంబం గురించిన విషయాలేవీ తెలియవని, తనకా బాధ లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించగా... దానిపై అజం స్పందిస్తూ, తనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని, కుటుంబం లేని రాజు మనకున్నారని వ్యాఖ్యానించారు.