: ఐసీసీ టెస్టు టీంలో మనవాళ్లు ఒక్కరూ లేరు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ ఏడాదికి గాను టెస్టు, వన్డే డ్రీమ్ టీంలను ప్రకటించింది. వన్డే జట్టుకు నాయకుడిగా మహేంద్ర సింగ్ ధోనీ ఎంపికైనా, టెస్టు జట్టులో మాత్రం ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ మేరకు జట్లను ఎంపిక చేసింది. ఐసీసీ టెస్టు టీంకు కెప్టెన్ గా శ్రీలంక సారథి ఏంజెలా మాథ్యూస్ ఎంపికయ్యాడు. ఐసీసీ వన్డే జట్టు: ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), మహ్మద్ హఫీజ్, క్వింటన్ డి కాక్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జార్జ్ బెయిలీ, ఏబీ డివిలీర్స్, డ్వేన్ బ్రావో, జేమ్స్ ఫాక్నర్, డేల్ స్టెయిన్, మహ్మద్ షమీ, అజంత మెండిస్. ఐసీసీ టెస్టు జట్టు: ఏంజెలో మాథ్యూస్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, కుమార సంగక్కర, ఏబీ డివిలీర్స్, జో రూట్, డేల్ స్టెయిన్, మిచెల్ జాన్సన్, స్టూవర్ట్ బ్రాడ్, రంగన హెరాత్, టిమ్ సౌథీ, రాస్ టేలర్ (12వ ఆటగాడు).