: సీమ సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరిస్తాం: చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. కురబలకోట మండలం అంగళ్లులో నిర్వహించిన 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన్న బాబు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయలసీమలో ఎన్నో సమస్యలున్నాయని అన్నారు. ముఖ్యంగా, తాగు, సాగునీటి సమస్యలు సీమ వాసులను వేధిస్తున్నాయని తెలిపారు. సీమ కష్టాలను క్రమపద్ధతిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక, విద్య గురించి మాట్లాడుతూ, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. బాలల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నేటితరం విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని లక్ష్యాలు పెట్టుకోవడం పట్ల బాబు హర్షం వ్యక్తం చేశారు.