: సల్లూ భాయ్ ‘జింక’ల కేసులో సుప్రీం తీర్పు వాయిదా


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘కృష్ణ జింక’ల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ అడవుల్లోకి వెళ్లిన సల్మాన్ ఖాన్ సహ నటులు సోనాలి బెంద్రె, టబు, నీలమ్ లతో కలిసి కృష్ణ జింకలను వేటాడారన్న అరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇతర నటుల పాత్రపై రాజస్థాన్ పోలీసులకు ఆధారాలు లభించకపోయినా, సల్మాన్ ప్రమేయంపై ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో అతడికి జైలు శిక్ష విధిస్తూ రాజస్థాన్ లోని కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ శిక్షపై గతేడాది రాజస్థాన్ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ గోయల్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News