: ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థి వార్షిక వేతనం రూ.91 లక్షలు!
దేశంలోని ఐఐటీల్లో ఖగర్ పూర్ ఐఐటీది ప్రత్యేక స్థానం. అందులో విద్యనభ్యసించిన విద్యార్థులదీ ప్రత్యేక స్థానమే. ఎందుకంటే ఏటా జరగుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అధిక వేతనాలతో కొత్త ఉద్యోగాలు చేజిక్కించుకుంటున్న వారిలో వారిదే అగ్రస్థానం. తాజాగా ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అధిక వేతనంతో ఉద్యోగాన్ని పొందిన విద్యార్థి కూడా ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థే. ఇంకా తుది ఎంపిక జరగకముందే ఆ సంస్థకు చెందిన ఓ విద్యార్థికి వార్షిక వేతనం కింద ఓ కంపెనీ ఏకంగా రూ.91 లక్షలను ఆఫర్ చేసింది. ఇక క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భాగంగా తుది ప్లేస్ మెంట్లు డిసెంబర్ 1 నుంచి మొదలు కానున్నాయి. ఈ ఎంపికలో సదరు విద్యార్థికి మరింత ఎక్కువ వేతనం లభించినా ఆశ్చర్యపోనవసరం లేదు.