: వివేక్ ఓబెరాయ్ కి ప్రధాని మెచ్చుకోలు
'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "స్వచ్ఛ భారత్ కోసం వివేక్ ఓబెరాయ్ శ్రమను అభినందిస్తున్నా" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా వివేక్ చీపురు పట్టుకుని ముంబయి వీధులను శుభ్రం చేశారు.