: తెలంగాణ బడ్జెట్ వివరాలు - 2


తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే... * 1000 ఎకరాల్లో గ్రీన్ హౌస్ కల్టివేషన్. * కమతాల ఏకీకరణకు ప్రతిపాదన. * డ్రిప్ ఇరిగేషన్ కు రూ. 250 కోట్లు. డ్రిప్ ఇరిగేషన్ లో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ. * బాసర ట్రిపుల్ ఐటీకి రూ. 119.63 కోట్లు. * సాంకేతిక విద్యకు రూ. 212.86 కోట్లు. * కేజీ టు పీజీ విద్య ప్రణాళికకు రూ. 25 కోట్లు. * ఏజన్సీ ప్రాంతాల్లో విద్యా సంస్థల అభివృద్ధికి రూ. 245.92 కోట్లు. * వికలాంగుల పింఛన్లకు రూ. 367.75 కోట్లు. * వృద్ధులు, వితంతువుల కోసం రూ. 450 కోట్లు. * జిల్లా ఆసుపత్రుల అభివృద్ధికి రూ. 42 కోట్లు. * గర్భిణీ, మహిళా, శిశు సంక్షేమానికి రూ. 330 కోట్లు. * ఆదిలాబాద్ లో కొమరం భీమ్ మెమోరియల్ అభివృద్ధికి రూ. 25 కోట్లు. * వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1000 కోట్లు. * భూసార పరీక్షకు రూ. 20 కోట్లు. * పాఠశాలల అభివృద్ధికి రూ. 10 కోట్లు. * మార్కెట్ల ఇంటర్వెన్షన్ కు రూ. 400 కోట్లు. * వైద్య శాఖకు రూ. 2,282.86 కోట్లు. * గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు చెరో రూ. 100 కోట్లు. * మెటర్నిటీ ఆసుపత్రులకు రూ. 50 కోట్లు. * కింగ్ కోఠి ఆసుపత్రికి రూ. 27 కోట్లు, నీలోఫర్ ఆసుపత్రికి రూ. 30 కోట్లు. * ఈఎన్ టీ ఆసుపత్రులకు రూ. 40 కోట్లు. * మెడికల్ కాలేజి భవనాలకు రూ. 152 కోట్లు. * ఇరిగేషన్ కు రూ. 6 వేల కోట్లు. * దళితుల భూ పంపిణీకి రూ. 1000 కోట్లు. * మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు. * ఆర్టీసీ అభివృద్ధికి రూ. 400 కోట్లు. త్వరలోనే వెయ్యి బస్సుల కొనుగోలు. * హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యి ఎకరాలలో కూరగాయల సాగు. * హార్టికల్చర్ అభివృద్ధికి రూ. 250 కోట్లు. * విద్యాశాఖకు రూ. 10,600 కోట్లు. * ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ. 90 కోట్లు. * హైదరాబాదులో మౌలికవసతుల కల్పనకు పెద్దపీట. నగరాన్ని సేఫ్, స్మార్ట్, స్లమ్ లెస్ సిటీగా మారుస్తాం. * హైదరాబాదులో మహిళా భద్రతకు రూ. 10 కోట్లు. * హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు రూ. 44.59 కోట్లు. * సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు రూ. 25 కోట్లు. * బీసీల సంక్షేమానికి రూ. 2,222 కోట్లు.

  • Loading...

More Telugu News