: సచిన్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' నేడే విడుదల
మార్కెట్లోకి రాకముందే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' బుధవారం విడుదలవుతోంది. టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ఓ రింగ్ మాస్టర్ అంటూ సచిన్ తన ఆత్మకథలో చేసిన ఆరోపణలు పుస్తకానికి ప్రాచుర్యం కల్పించాయి. దానికితోడు, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు సైతం సచిన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం కూడా పుస్తకంపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తన నివాసానికి వచ్చిన ఛాపెల్... ద్రావిడ్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టాలంటూ కోరాడని సచిన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఛాపెల్... సచిన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశాడు.