: మోదీ చాలా అందమైన వ్యక్తి: సైఫ్ అలీఖాన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా అకర్షణీయమైన వ్యక్తి అని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పేర్కొన్నాడు. ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో భార్య కరీనాకపూర్ తో కలసి సైఫ్ మోదీని కలిశాడు. అప్పుడే ఆయనతో ఓ సెల్ఫీ ఫోటో కూడా తీసుకున్నాడు. దానికి సంబంధించి మాట్లాడుతూ, ప్రధాని చాలా అందమైన, ఆకర్షణీయమైన వ్యక్తని అప్పుడే గుర్తించానన్నాడు. ఆయన్ను కలవడం చాలా అద్భుతంగా అనిపించిందని, చాలా సహజమైన వ్యక్తని చెప్పాడు. కార్యక్రమంలొ చాలా గొప్పగా ప్రసంగించారని సైఫ్ తెలిపాడు.