: జపాన్ పురస్కారాన్ని స్వీకరించిన మన్మోహన్ సింగ్
జపాన్ ప్రకటించిన 'ద గ్రాండ్ కొర్డాన్ ఆఫ్ ద ఆర్టర్ ఆఫ్ ద పౌల్వేనియ ఫ్లవర్స్' అత్యున్నత జాతీయ పురస్కారాన్ని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వీకరించారు. టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జపాన్ చక్రవర్తి అకిహితో ఆ అవార్డును బహుకరించారు. తను ప్రధానిగా ఉన్న సమయంలో జపాన్, భారత్ ల సంబంధాలను మెరుగుపరిచినందుకు, స్నేహాన్ని ప్రోత్సహించినందుకు మన్మోహన్ ను జపాన్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.