: అమరవీరుల కుటుంబాలకు రూ. 100 కోట్లు: ఈటెల
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది కేవలం 10 నెలల బడ్జెట్ మాత్రమే అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. ప్రజల నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించామని... వాటిని దృష్టిలో ఉంచుకుని స్వల్పకాల, దీర్ఘకాల కార్యక్రమాలను రూపొందించామని వెల్లడించారు. పథకాలను రూపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణ కోసం 60 ఏళ్లు పోరాడామని... ఇప్పుడు బంగారు తెలంగాణను సాధించుకుందామని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 100 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఎక్కువ శాతం వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలే ఉన్నారని చెప్పారు.