: అమ్మాయిలకు కౌన్సెలింగే 'లవ్ జిహాద్'కు విరుగుడు: మోహన్ భగవత్
ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన 'లవ్ జిహాద్'పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఆగ్రాలో జరిగిన 'యువ సంకల్ప్ శివిర్' చివరిరోజున ఆయన మాట్లాడుతూ, అమ్మాయిలకు నైతిక విలువల పట్ల కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా 'లవ్ జిహాద్'ను ఎదుర్కొనవచ్చని ఉద్ఘాటించారు. బాలికలకు తల్లిదండ్రులు విలువలను నేర్పడం ద్వారా వారిని ప్రేమ ఉచ్చులో పడకుండా నిరోధించవచ్చని సూచించారు. ఒకవేళ అమ్మాయి మాట వినకుంటే, అబ్బాయి తల్లిదండ్రులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని భగవత్ సూచించారు. చివరి ప్రయత్నంగానే పోలీసులను సంప్రదించాలని స్పష్టం చేశారు.