: బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు కన్నా కుమారుడు నాగరాజు, ఇతర అనుచరులు కూడా బీజేపీలో చేరారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలసిన కన్నా పార్టీలో చేరే విషయంపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.