: తొలి బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ కు ఈ సందర్భంగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, పలువురు మంత్రులు హాజరై అంగీకారం తెలిపారు. మరికాసేపట్లో మొదలవనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థికమంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.