: లాంతర్లతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణలో విద్యుత్ కోతలపై వినూత్న నిరసన తెలిపేందుకు బీజేపీ సిద్ధమైంది. నేడు ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు లాంతర్లు చేతబట్టి ర్యాలీగా రావాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని బీజేపీ ఆరోపిస్తోంది. విద్యుత్ కోతల నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతు ఆత్మహ్యతలు పెరిగాయని కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కోతలకు కారణమైన ప్రభుత్వ తీరుకు నిరసనగా లాంతర్లతో అసెంబ్లీకి వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది.