: అసెంబ్లీ వద్ద 2,300 మందితో భారీ బందోబస్తు


తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పరిచారు. రెండు ప్రధాన గేట్లతో పాటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అడుగడుగునా సాయుధులైన పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతోపాటు, అసెంబ్లీ లాబీ, మీడియా పాయింట్, గ్యాలరీ ప్రాంతాల్లో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ సిబ్బంది మఫ్టీలో ఉన్నారు. అసెంబ్లీకి నలువైపులా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేయకుండా పోలీస్ కమిషనర్ నిషేధాజ్ఞలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News