: నేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు


ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును మరిచిన చంద్రబాబునాయుడు సర్కారు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు తెర లేపనుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది. పంట రుణాలు, డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ఆ హామీల అమలును మరిచారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు సర్కారు వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఉదయం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగనున్నారు.

  • Loading...

More Telugu News