: ఢిల్లీ సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించమన్న బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో... మరో ఎన్నికల రణరంగానికి రంగం సిద్ధమయింది. కేంద్ర మంత్రివర్గ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగనుంది. దీంతో, త్వరలోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాల్లో విజయ దుందుభి మోగిస్తున్న బీజేపీ... ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది. ఎత్తులు, పైఎత్తులు వేయడంలో సిద్ధహస్తులైన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు రచించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే, ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో ముందే ప్రకటించమని బీజేపీ స్పష్టం చేసింది. దాదాపు ఇలాంటి ఎత్తుగడతోనే మహారాష్ట్రలో తొలిసారి అధికారాన్ని చేపట్టింది బీజేపీ.