: విపత్తుల నుంచీ అవకాశాలను సృష్టించుకోగలను: చంద్రబాబు
విపత్తుల నుంచి కూడా అవకాశాలను సృష్టించుకునే సత్తా తనకుందని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళవారం బెంగళూరులో పర్యటించిన సందర్భంగా అక్కడి పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటకలో పార్టీని విస్తరించే ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు. ఏపీని దేశానికే ముఖ ద్వారంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించిన ఆయన బెంగళూరులో పార్టీని పటిష్టం చేస్తామని ప్రకటించారు.