: చంద్రబాబుకు దొరకని సిద్ధరామయ్య అపాయింట్ మెంట్!
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య షాకిచ్చారు. తనను కలిసేందుకు నేరుగా బెంగళూరుకు వచ్చిన చంద్రబాబుకు సిద్ధరామయ్య స్వాగతం పలకడం కాదుకదా, అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో సిద్ధరామయ్యతో భేటీని రద్దు చేసుకున్న చంద్రబాబునాయుడు, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై నిరాశగా వెనుదిరిగారు. సాధారణంగా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, మర్యాద పూర్వకంగానైనా వారితో కలవడం ఆయా రాష్ట్రాల సీఎంల కనీస బాధ్యత. ఈ సంప్రదాయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటిస్తున్నారు కూడా. అయితే అందుకు విరుద్ధంగా సిద్ధరామయ్య, చంద్రబాబుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.