: 'కిస్ ఆఫ్ లవ్' నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు


బీజేవైఎం నేతల మోరల్ పోలీసింగ్ కు వ్యతిరేకంగా 'కిస్ ఆఫ్ లవ్' పేరిట కేరళలోని కొచ్చి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో కార్యక్రమం నిర్వహించిన వంద మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు, 'కిస్ ఆఫ్ లవ్' చట్ట విరుద్ధం అంటూ ఈ రోజు కేసులు నమోదు చేశారు. నిజానికి ఆ రోజు ముద్దుల నిరసనలో పాల్గొన్నవారి కంటే భగ్నం చేసేందుకు వచ్చిన శివసేన, బీజేఎంవై కార్యకర్తలు, దానిని చూసేందుకు కుతూహలంతో వచ్చిన వాళ్లే ఎక్కువగా కనిపించారు. అయితే అక్కడ జరిగింది ముద్దుల కార్యక్రమం కాదు... అది కేవలం నిరసన ర్యాలీ మాత్రమే. అప్పుడే వారిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పుడు వారిపై కేసులు నమోదు చేయలేదు.

  • Loading...

More Telugu News