: జగన్ కు కేఈ సూటి ప్రశ్న!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఇచ్చిన ఏ హామీలు తప్పుడువో చెప్పాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సవాలు విసిరారు. కర్నూలు జిల్లాలో ఆయన మాట్లాడుతూ, టీడీపీకి రెండు రాష్ట్రాల్లోనూ 25 లక్షల మంది సభ్యులున్నారని చెప్పారు. శ్రీశైలం నీటిని రాయలసీమ ప్రజలకు దక్కకుండా కేసీఆర్ విద్యుత్ తయారు చేసుకుని తరలించుకుపోతుంటే ప్రతిపక్ష నేతగా జగన్ ఏం చేశాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ వాసులు ఏమైపోయినా జగన్ కు ఫరవాలేదని ఆయన మండిపడ్డారు.