: మన్మోహన్ కు సోనియాగాంధీ అభినందనలు


జపాన్ అత్యున్నత జాతీయ అవార్డు 'ద గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోనియా ఫ్లవర్స్'కు ఎంపికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభినందించారు. "జపాన్ ప్రభుత్వం ద్వారా ఓ రాజనీతిజ్ఞుడికి అరుదైన, తగిన గుర్తింపు లభించింది. ఆ అవార్డు పొందిన డాక్టర్ సింగ్ మాతో పాటు, జాతి మొత్తం గర్వపడేలా చేశారు" అని సోనియా పేర్కొన్నారు. భారత్-జపాన్ మధ్య సంబంధాలను తన హయాంలో మరింత బలోపేతం చేసినందుకు గానూ మన్మోహన్ కు జపాన్ ఈ పురస్కారం ప్రకటించింది.

  • Loading...

More Telugu News