: సమావేశమైనా టీమిండియాను ఎంపిక చేయని సెలెక్టర్లు
భారత క్రికెట్ సీనియర్ సెలెక్షన్ కమిటీ ముంబయిలో సమావేశమైనా జట్టును మాత్రం ఎంపిక చేయలేదని తెలుస్తోంది. జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐకి, సెలెక్షన్ కమిటీకి నడుమ భేదాభిప్రాయాలు రావడమే అందుకు కారణం! ఈ నెల 10న ముద్గల్ కమిటీ నివేదికపై సుప్రీంలో విచారణ జరగనుంది. ఆ తర్వాతే జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు, శ్రీలంకతో చివరి రెండు వన్డేలకు నేటి సమావేశంలో జట్లను ప్రకటించాల్సి ఉంది. బోర్డుకు, సెలెక్టర్లకు ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది.