: కేసీఆర్ పెద్దవాడూ కాదు, పిల్లవాడూ కాదు... ఓ సన్నాసి: రేవంత్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ పెద్దవాడూ కాదు, పిల్లవాడూ కాదని, ఓ సన్నాసి అని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం చంద్రబాబు తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ అసమర్థత వల్లే తెలంగాణలో విద్యుత్ కష్టాలు వచ్చిపడ్డాయని రేవంత్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి చంద్రబాబు అదనపు విద్యుత్ ను రాబట్టుకోగలిగారని, కేసీఆర్ కు అది సాధ్యపడలేదని విమర్శించారు. చేతకానితనాన్ని ప్రజలకు చెప్పకుండా, మామా అల్లుళ్లు మందిని ఆడిపోసుకుంటున్నారని పరోక్షంగా హరీశ్ రావుపైనా సెటైర్ వేశారు. మిగులు బడ్జెట్ ఉండి కూడా రైతులకు కేసీఆర్ ఏం చేయలేకపోయాడని దుయ్యబట్టారు. తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎలా లభించిందో చెప్పాలని రేవంత్ సవాల్ విసిరారు. బాబు ఒప్పుకోవడవం వల్లే తెలంగాణకు అధిక విద్యుత్ లభించిందని తెలిపారు. కేసీఆర్ ఒప్పుకోకపోయినా ఇది నిజమని రేవంత్ ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News