: కర్నూలు ఆసుపత్రిలో భూమా నాగిరెడ్డికి పరీక్షలు


వైద్య పరీక్షల నిమిత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అంతకుముందు, నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ప్రైవేటు వైద్యం అందించడంపై న్యాయస్థానం ఆగ్రహించింది. దాంతో, జైళ్లశాఖ ఉన్నతాధికారుల విచారణ అనంతరం భూమాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అటు, ఆయనకు వివిధ పరీక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో కర్నూలుకు తరలించాలని నిర్ణయించారు. టీడీపీ కౌన్సిలర్లపై హత్యయత్నం కేసులో భూమా లొంగిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News