: 'కత్తి' స్టోరీ కాపీ కొట్టారంటూ మురుగదాస్ పై ఆరోపణలు


ఇటీవలే విడుదలై సూపర్ హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న తమిళ చిత్రం'కత్తి'కి సంబంధించి కొత్త సమస్య ఎదురైంది. ఈ సినిమా కథ వాస్తవానికి తనదేనని తమిళ నిర్మాత మింజుర్ గోపి దర్శకుడు మురుగదాస్ పై ఆరోపణలు చేస్తున్నాడు. ఈ మేరకు ఆ నిర్మాత చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు. మురుగదాస్ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం వచ్చినప్పుడు గతంలో తాను అతన్ని మూడుసార్లు కలిశానని చెప్పాడు. అప్పుడే తన కథ, స్క్రిప్టు గురించి దర్శకుడితో ఫోన్ లో మాట్లాడానని గోపి అంటున్నాడు.

  • Loading...

More Telugu News