: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుపానుగా మారే అవకాశాలపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రిపూట చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉంది.