: మంత్రి రావెలపై చంద్రబాబు ఆగ్రహం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి రావెల కిశోర్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో రావెల చేసిన వ్యాఖ్యలు బాబుకు ఆగ్రహం తెప్పించాయి. ఈ విషయమై బాబు ఉదయం రావెలను పిలిచి, వివరణ కోరినట్టు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుపై పునరాలోచించుకుంటామని మంత్రి వ్యాఖ్యానించడం తెలిసిందే.