: జాతీయ క్రీడల థీమ్ సాంగ్ కోసం జట్టుకట్టిన హరిహరన్, జావెద్ అఖ్తర్
సుప్రసిద్ధ గీత రచయిత జావెద్ అఖ్తర్, విఖ్యాత గాయకుడు హరిహరన్ జాతీయ క్రీడలకు థీమ్ సాంగ్ రూపొందించారు. మూడు నిమిషాల నిడివి కలిగిన ఈ గేయం హిందీలో ఉంటుంది. అఖ్తర్ రాసిన ఈ పాటకు హరిహరన్ స్వరాలు సమకూర్చారు. ఈ గీతం ఆవిష్కరణను భారీ ఎత్తున చేపట్టేందుకు జాతీయ క్రీడల నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 35వ జాతీయ క్రీడలు జనవరి 31న ఆరంభం కానున్నాయి. ఈ జాతీయ క్రీడలకు కేరళలోని తిరువనంతపురం ఆతిథ్యమిస్తోంది. కాగా, ఈ గేయం క్రీడాస్ఫూర్తిని ప్రముఖంగా చాటనుంది. ఈ ప్రబోధాత్మక గీతం యేసుదాస్, శ్రేయా ఘోషాల్, సలీం మర్చంట్, శృతి హాసన్, హరిహరన్ తదితరుల గాత్రాల్లో వినిపిస్తుంది.