: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం


జర్మనీలోని మ్యూనిక్ లో రామెర్స్ డార్ఫ్ జిల్లాలో ఓ భారీ బాంబు లభ్యమైంది. ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిదని భావిస్తున్నారు. మెకానికల్ ఇగ్నైటర్ కలిగి ఉన్న ఈ బాంబు 250 కిలోల బరువుంది. ఈ బాంబును వెలికితీసే సమయంలో, ఆ ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో నివసిస్తున్న 1500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేగాకుండా, సమీపంలోని జాతీయరహదారిని పాక్షికంగా మూసివేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో మ్యూనిక్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది.

  • Loading...

More Telugu News