: రఫెల్ నాదల్ కు అపెండిక్స్ సర్జరీ
స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ కు అపెండిక్స్ సర్జరీ జరిగింది. చాలా సజావుగా ఆపరేషన్ జరిగినట్టు అతడి నిర్వహణ సంస్థ తెలిపింది. "రఫా ఇప్పుడు బాగున్నాడు. ఆపరేషన్ కూడా చాలా బాగా జరిగింది. అంతా బాగుంటే ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావొచ్చు" అని 'బీ1పీఆర్' ట్విట్టర్ పేజ్ లో పోస్టు చేసింది. ఇప్పటివరకు పద్నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న నాదల్ సర్జరీ కోసం గత నెల స్విస్ ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అప్పుడే తన ఆపరేషన్ గురించి కూడా తెలిపాడు.