: హుదూద్ బాధితులకు కేసీపీ సిమెంట్స్ రూ.2 కోట్ల విరాళం
హుదూద్ తుఫాను కారణంగా అతలాకుతలమైన ఉత్తరాంధ్ర బాధితుల సహాయార్థం కేసీపీ సిమెంట్స్ భారీ విరాళాన్ని ప్రకటించింది. బాధితులను ఆదుకోవాలంటూ రూ.2 కోట్ల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఈ మేరకు కేసీపీ సిమెంట్స్ బోర్డు డైరెక్టర్ ఇందిరా దత్ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రూ.2 కోట్ల చెక్ ను అందజేశారు.