: ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం
ఢిల్లీలో అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దానికి సంబంధించిన నివేదికను వెంటనే కేంద్రానికి పంపారు. అటు అసెంబ్లీ రద్దు అంశంపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.