: కేంద్ర మంత్రి ఉమాభారతిని కలసిన మంత్రి ఉమ
ఢిల్లీ వెళ్లిన ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశారు. ఆయనతో పాటు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ఉన్నారు. 25 నిమిషాలపాటు సాగిన సమావేశంలో, శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి అంశంలో కృష్ణాబోర్డు ఆదేశాలను తెలంగాణ రాష్ట్రం బేఖాతరు చేసిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలను ఉమాభారతికి అందజేశారు. ఈ విషయంపై పరిష్కారం చూపాలని వారు కోరారు.