: సచిన్ చెబుతున్నవన్నీ అబద్ధాలే!: గ్రెగ్ చాపెల్
సచిన్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' మార్కెట్లోకి రాకముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అందులో భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పై సచిన్ చేసిన ఆరోపణలు పెద్ద చర్చనే లేవనెత్తుతున్నాయి. అయితే, తనపై సచిన్ చేసిన ఆరోపణలను గ్రెగ్ ఖండించాడు. తన ఆత్మకథలో సచిన్ వెల్లడించిన అంశాలన్నీ అసత్యాలని చెప్పాడు. ద్రావిడ్ ను తప్పించాలని తానెప్పుడూ ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, సచిన్ ను కెప్టెన్ గా ఉండాలని కూడా తానెప్పుడూ కోరలేదని చెప్పాడు. ఈ పుస్తకం గురువారంనాడు మార్కెట్లోకి విడుదలవుతోంది.