: శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపివేసిన టీఎస్ ప్రభుత్వం


శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ లో ఈ రోజు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన టీఎస్ ప్రభుత్వం... మళ్లీ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. టీఎస్ జెన్ కో ఈరోజు 25 నిమిషాల పాటు విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక ఎవరి ప్రమేయం కాని, ఒత్తిడి కాని లేవని... ప్రస్తుతం విద్యుత్తుకు డిమాండ్ తక్కువగా ఉందని, అందుకే ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ అవసరమైనప్పుడు ఉత్పత్తిని పున:ప్రారంభిస్తామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News