: గవర్నర్ కు ప్రధాని మోదీ ఫోన్!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి కాదండి బాబూ, జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికట. నేడు గవర్నర్ నరసింహన్ జన్మదినం. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా నరసింహన్ కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ ఉదయం గవర్నర్ ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.