: తిరుమలలో అన్యమత ప్రచారకులు టీటీడీ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులేనట!


తిరుమలలో అన్యమత ప్రచారంపై సీరియస్ గా దృష్టి సారించిన టీటీడీకి దిగ్భ్రాంతి కలిగే వాస్తవాలు కనిపించాయి. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించిన టీటీడీ, 69 మందితో కూడిన ఓ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు టీటీడీలోనే పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు ఉన్నారట. దీంతో దేవస్థానం పాలక మండలి షాక్ కు గురైంది. సొంత ఉద్యోగులే ఈ దురాగతాలకు పాల్పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలక మండలి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా సదరు వ్యక్తుల కుటుంబాలను తిరుమల నుంచి పంపించివేసేందుకు చర్యలు ప్రారంభించింది. అంతేకాక ఇకపై తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా టీటీడీ సమాయత్తమవుతోంది.

  • Loading...

More Telugu News