: సీఐసీ ఎంపిక కమిటీలో మల్లికార్జున ఖర్గేకు చోటు


లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేకు ఎట్టకేలకు ప్రతిపక్ష నేత స్థాయి గౌరవం దక్కింది. తగినంత మంది బలం లేని కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరించిన మోదీ సర్కారు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను ఎంపిక చేసే కమిటీలో ఖర్గేను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నేతృత్వంలోని ఈ కమిటీలో ఖర్గేతో పాటు రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా సభ్యుడిగా నియమితులయ్యారు. సీఐసీ ఎంపిక కమిటీలో విపక్ష సభ్యుల ప్రాతినిధ్యం లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్న న్యాయ శాఖ వాదనతో ఏకీభవించిన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News