: త్రిష, శింబూల పార్టీలో సానియా మీర్జా!
వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, చెన్నైలో త్రిష, శింబూలతో కలిసి సానియా మీర్జా పార్టీ చేసుకుందట. సదరు విషయాన్ని పార్టీ ఇచ్చిన త్రిష స్వయంగా వెల్లడించడంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన సెల్ఫీని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇటీవల ఓ ప్రముఖ మేగజీన్ త్రిషను ‘దివా ఆఫ్ సౌత్’గా పేర్కొంటూ అవార్డు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా హాజరైంది. ఈ సందర్భంగా మేగజీన్ యాజమాన్యం సానియాను సన్మానించింది. ఆ కార్యక్రమం ముగియగానే సానియా, శింబూలను త్రిష తన ఇంటికి ఆహ్వానించిందట. త్రిష ఆహ్వానం మేరకు శింబూతో పాటు సానియా కూడా త్రిష ఇంటిలో జరిగిన పార్టీకి హాజరైంది. పార్టీలో తాము ముగ్గురం బాగానే ఎంజాయ్ చేశామని త్రిష చెప్పింది.