: నేడు బెంగళూరుకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు కర్ణాటక రాజధాని బెంగళూరు వెళుతున్నారు. బెంగళూరు పర్యటనలో భాగంగా చంద్రబాబు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ కానున్నారు. కర్ణాటక నుంచి రాయలసీమకు న్యాయంగా రావాల్సిన నీటి వాటా గురించి ఆయన కర్ణాటక సీఎంతో చర్చించనున్నారు. నిబంధనల మేరకు ఎగువనున్న కర్ణాటక ప్రాజెక్టుల నుంచి క్రమం తప్పకుండా నీరు విడుదల కావాల్సిందేనని కూడా చంద్రబాబు కర్ణాటకకు తేల్చి చెప్పనున్నారు.