: బీజేపీతో పొత్తుపై పునరాలోచించుకుంటాం: ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కేవలం అభివృద్ధి కోసమే బీజేపీతో తాము పొత్తు పెట్టుకున్నామని... సిద్ధాంతాల విషయంలో రాజీ పడబోమని ఏపీ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు స్పష్టం చేశారు. ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ముందుకెళతామని చెప్పారు. అవసరమైతే బీజేపీతో పొత్తు విషయంపై పునరాలోచన చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీని, మోదీని ప్రశంసిస్తుంటే... మరోవైపు పార్టీలో కీలక నేత ఈ వ్యాఖ్యలు చేయడం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఈ వ్యాఖ్యల వెనుక భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలేమైనా ఉన్నాయా? అని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.