: 'మేరు' క్యాబ్ డ్రైవర్ల ఆందోళన తీవ్రరూపం... రెండు క్యాబ్ లకు నిప్పు!


'మేరు' క్యాబ్ డ్రైవర్ల ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. సోమవారం మేరు కార్యాలయంపై దాడికి దిగిన క్యాబ్ డ్రైవర్లు, మంగళవారం మరింత రెచ్చిపోయారు. రెండు క్యాబ్ లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులకు తెర తీశారు. ఎయిర్ పోర్టులో పార్కింగ్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, తమ డిమాండ్లను పెడచెవిన పెడుతున్న యాజమాన్యం, వేధింపులకు గురి చేస్తోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద రెండు రోజులుగా అద్దె వాహనాలు దొరకక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News