: కేసీఆర్ ను మేము కూడా సన్నాసి అనగలం...!: పరకాల


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగిస్తున్న భాషపై ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ ను తాము కూడా సన్నాసి అనగలమని... కానీ, గౌరవ ముఖ్యమంత్రి అంటూనే తాము సంబోధిస్తామని అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని... హోదాకు తగ్గ రీతిలో ప్రవర్తిస్తేనే గౌరవం లభిస్తుందని హితబోధ చేశారు. ప్రతి రోజూ అబద్ధాలాడటం కేసీఆర్ మానుకోవాలని... లేకపోతే తెలంగాణ ప్రభుత్వ దాష్టీకాలను ఎండగడతామని హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టీకాలను కేసీఆర్ ఆపకపోతే... కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కార్మిక సంక్షేమ నిధి తరలింపు సీనియర్ అధికారుల నిర్ణయం ప్రకారమే జరిగిందని, ఏపీ అధికారులపై దాడులు చేయడం, పోలీసు కేసులు పెట్టి వేధించాలనుకోవడం మంచిది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News