: తెలంగాణపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న ఏపీ


శ్రీశైలం వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రి ఉమాభారతిని తెలంగాణ మంత్రి హరీష్ రావు కలసి శ్రీశైలం విద్యుత్ కేంద్రం విషయంలో ఏపీ అనుసరిస్తున్న విధానంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణకు అన్యాయం జరగదని కేంద్రం హామీ ఇచ్చిందని మీడియాతో మంత్రి చెప్పారు. దీంతో మేలుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తామేదో తప్పు చేసినట్టు కేంద్రానికి ఎందుకు సంకేతాలివ్వాలని భావించింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు కేంద్రానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి తెలంగాణ తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News