: డిసెంబర్ 7న విజయవాడలో టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్


హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ ఉదారంగా స్పందిస్తోంది. విశాఖ అందాలను పలు సినిమాల్లో చూపించిన సినీ పరిశ్రమ, ఆ నగర అందాలు తుపాను బీభత్సానికి కళావిహీనం కావడంతో విశాఖను పునర్నిర్మించేందుకు సమాయత్తమైంది. తుపాను బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ ను విజయవాడలో నిర్వహించనుంది. డిసెంబర్ 7న నిర్వహించనున్న ఈ క్రికెట్ మ్యాచ్ లో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం పాల్గోనుంది. ఈ మ్యాచ్ ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నామని టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

  • Loading...

More Telugu News