: జూడాల సమ్మెకాలం గైర్హాజరే... విధుల్లో చేరకుంటే ఎస్మా ప్రయోగం!: డీఎంఈ


జూనియర్ డాక్టర్ల సమ్మెకాలాన్ని గైర్హాజరుగా పరిగణిస్తామని డీఎంఈ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన 350 మంది జూనియర్ డాక్టర్లు ప్రస్తుతం విధుల్లో ఉన్నారని అన్నారు. సమ్మెలో పాల్గొంటూ విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ వైద్యులు, మరో పది రోజుల్లో విధుల్లో చేరకుంటే, విద్యాసంవత్సరాన్ని కోల్పోయినట్టేనని డీఎంఈ స్పష్టం చేశారు. జూనియర్ వైద్యులు విధుల్లో చేరకుంటే ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ మేరకు జూడాల తల్లిదండ్రులకు సమాచారం అందజేశామని అధికారులు వెల్లడించారు. వారి తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్ పై ఆలోచించాలని వారు సూచించారు.

  • Loading...

More Telugu News