: నల్లధనమన్నదే లేకుండా చేస్తాం: ప్రకాశ్ జవదేకర్
దేశంలో నల్లధనమన్నది లేకుండా చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నల్లధనం దేశంలో లేకుండా చేసేందుకు ఏఏ చర్యలు చేపట్టాలో ఆలోచిస్తున్నామని అన్నారు. అక్రమ బ్యాంకు ఖాతాలు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు రప్పించేందుకు ప్రధాని కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన వెల్లడించారు. మోదీ ఏదైనా చెబితే అది సాకారమయ్యేవరకు విశ్రమించరని ఆయన తెలిపారు.